అవి దొంగ ఏడుపులేమో అన్న ట్రంప్... ఘాటుగా స్పందించిన ఇరాన్
- ఖమేనీ అంత్యక్రియలపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
- ప్రజలది నకిలీ ఏడుపు కావచ్చని అనుమానం వ్యక్తం చేసిన ట్రంప్
- ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఇరాన్
- సువాసనను చంపలేరంటూ ఇరాన్ ఘాటు కౌంటర్
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఖమేనీ కోసం ప్రజలు కన్నీరుపెడుతుండడంపై స్పందిస్తూ.. అవి 'దొంగ ఏడుపులు' కావచ్చని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికాకు నాగరికత, చరిత్ర లేవంటూ ఘాటుగా బదులిచ్చింది.
యాక్సియోస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఖమేనీ అంత్యక్రియలకు భారీగా జనం తరలిరావడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. ప్రజలు ఖమేనీని ద్వేషిస్తారని తాను భావించానని, ఇప్పుడు కనిపిస్తున్నది నకిలీ శోకం కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇరాన్ ఉన్నత నాయకత్వం మొత్తం ఒకేచోట ఉందని, వారిని ఒక్క దెబ్బతో లేపేయగలమని, కానీ తర్వాత చర్చలు జరపడానికి ఎవరూ మిగలరనే ఉద్దేశంతోనే అలా చేయడం లేదని వ్యాఖ్యానించారు.
ట్రంప్ వ్యాఖ్యలపై అర్మేనియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా స్పందించింది. "వ్యక్తులను చంపగలరు, కానీ వారి ఆశయాలను చంపలేరు. మీరు అయతొల్లా ఖమేనీని చంపారు. కానీ నిజానికి మీరు ఒక సుగంధ ద్రవ్యాల సీసాని పగలగొట్టారు, దాని సువాసన ఇప్పుడు ప్రతిచోటా వ్యాపించింది" అని పేర్కొంది. అమెరికాకు నాగరికత, చరిత్ర, గౌరవం లేవని విమర్శించింది.
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. టెహ్రాన్‌లో ఆయన అంత్యక్రియలకు లక్షలాది మంది హాజరవుతూ "అమెరికాకు మరణం" అంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు, ఇరాన్ సంతాప దినాలు ముగిశాక ఇరు దేశాల మధ్య చర్చలు పునఃప్రారంభం అవుతాయని ట్రంప్ సూచనప్రాయంగా తెలిపారు.